ETV Bharat / state

జోగులాంబ ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం: భాజపా నేతలు - telangana news

praja sangrama yatra: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు భాజపా శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 31 రోజుల పాటు 387కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. జోగులాంబ ఆలయంలో పార్టీ నేతలతో కలిసి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డ భాజపా నాయకులు.. జోగులాంబ ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జోగులాంబ ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం: భాజపా నేతలు

author img

By

Published : Apr 14, 2022, 8:23 PM IST

Praja Sangrama Yatra: కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జూటా: నడిగడ్డ పోరాటాల గడ్డ అని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు. కేసీఆర్​ ముఖ్యమంత్రి అయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆర్డీఎస్​ సమస్యను పరిష్కరించలేదని ఆమె మండిపడ్డారు. ఒక్క చుక్కయినా ఆర్డీఎస్​ కింద నడిగడ్డలో కేసీఆర్​ పారించారా అంటూ ప్రశ్నించారు. ఆర్డీఎస్​ కింద ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని ఆమె డిమాండ్​ చేశారు. కేసీఆర్​ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని డీకే అరుణ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క చుక్క నీరు రాలేదన్న ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జూటా అని విమర్శించారు. కేసీఆర్​ను ఓడిస్తామని జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేదని.. నిరుద్యోగ భృతి లేదని ఆమె మండిపడ్డారు. కేసీఆర్​ పాలనలో ఒక్క ఇళ్లయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజలను కేసీఆర్​ అధోగతి పాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. 57 ఏళ్లు నిండితే పింఛన్లు ఇస్తానని కేసీఆర్ చెప్పి.. మూడేళ్లు అవుతోందని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హామీలు ఇచ్చి కేంద్రాన్ని అమలు చేయమంటారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.

భవిష్యత్తు భాజపాదే: రాబోయే కాలంలో భవిష్యత్తు భాజపాదేనని హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భాజపాను ఆపగలిగే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్, తెరాస, మజ్లిస్ నేతలు దోపిడీ దొంగలు: ప్రధాన మంత్రులు కూడా రాజ్యాంగం మార్చాలని అనలేదని.. రాజ్యాంగం పాత బడిందని కేసీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డ కాబట్టే కేసీఆర్​కు అంబేడ్కర్ అంటే ఇష్టం లేదని ఆమె ఆరోపించారు. హుజూరాబాద్​లో దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోందన్న ఆమె.. అంబేడ్కర్ విగ్రహం ఏమైందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ భాష చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ఆర్థిక మూలలను దెబ్బకొట్టారన్నారు. కాంగ్రెస్, తెరాస, మజ్లిస్ నేతలు దోపిడీ దొంగలని విజయశాంతి ఆరోపించారు.

అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు: అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్‌ అంటున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని ఆయన అన్నారు. ఎస్సీలను కేసీఆర్‌ అన్ని రకాలుగా మోసం చేశారని లక్ష్మణ్​ ఆరోపించారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీలను కేసీఆర్ రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. భాజపా ఎదుగుదలను ఓర్వలేకే కేసీఆర్​ ముందస్తు ఎన్నికల రాగం పాడుతున్నారని.. లోక్‌సభతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

తెరాస గుండెల్లో దడ: బండి సంజయ్ పాదయాత్రతో తెరాస గుండెల్లో దడ పుడుతోందని భాజపా సీనియర్​ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. నడిగడ్డను కేసీఆర్ అభివృద్ధి చేయలేదన్న జితేందర్​ రెడ్డి.. ఇక్కడి ప్రజలు ఆయన క్షమించరన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే నడిగడ్డ సమస్యలు తీరతాయని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.