జోగులాంబ జిల్లా గద్వాల మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపల్లిలో పనులు ముగించుకొని స్వగ్రామం కొత్తపల్లి వస్తుండగా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బాధితులు తెలిపారు. వేగం తగ్గించమని చెప్పినా తమ మాట లెక్కచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న కొత్తపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.