జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలో మెడికల్ కళాశాలను మంజూరు చేయాలంటూ అఖిలపక్ష నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తోన్న వైద్య కళాశాలల్లో జిల్లాకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సరిహద్దులైన జిల్లాలోని పలు మారుమూల ప్రాంతాలకు సరైన వైద్యం అందడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తే.. అక్కడి అధికారులు చికిత్సకు నిరాకరిస్తున్నారని వాపోయారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందక ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: High Court: భూములను గుర్తించేందుకు విచారణ జరిపితే ఇబ్బందేంటి..?