జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఉన్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారు 80 రోజుల తర్వాత ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబసమేతంగా ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రి ముందుగా స్వామివారిని... తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు లేకపోవడం వల్ల సాధారణ దర్శనం చేసుకొని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు తెరుచుకున్నాయని... చాలా రోజుల తర్వాత గుడికి రావడం చాలా సంతోషానిచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి