జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మానవపాడు మండలం జల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. మేత వికటించి 34 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన మద్దిలేటి వెంకటరాముడు, కృష్ణ, మహేష్ గొర్రెల కాపరులు. రోజూలాగే మంగళవారం కూడా గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చాక గొర్రెలు ఇబ్బంది పడటం గమనించి పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. డాక్టర్లు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. తీరా పోస్టుమార్టం చేసి చూస్తే... అతిగా బుడమాకు తిని మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గొర్రెలే తమ జీవనాధారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి