జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి రహదారిపై సుమారు 300 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్గనైజర్లకు విత్తన పత్తి కంపెనీ 490 రూపాయలు ఇస్తుంటే రైతులకు మాత్రం 410 రూపాయలు ఇవ్వడమేంటనీ రైతులు ప్రశ్నించారు. పండించిన పంటకు డిసెంబర్ నెలలోనే కంపెనీలు ఆర్గనైజర్లకు డబ్బులు ఇవ్వగా, ఆర్గనైజర్లు జూలై మాసంలో వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అమ్మిన తరువాత చాలాకాలం తర్వాత డబ్బులు ఇవ్వడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అపూర్వ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీ. తిరుపతి కంపెనీల ప్రతినిధులతో పాటు ఆర్గనైజర్లు, కంపెనీలు మాకు రెండు వారాలు సమయం ఇవ్వాలని చెప్పడం వల్ల రైతులు నిరాశతో గద్వాల-ఎర్రవల్లి రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ట్రాఫిక్ జాం కావడం వల్ల పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఇదీ చూడండి : కుటుంబాన్ని బలిగొన్న సిలిండర్