జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 24వ వార్డుకు చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందగా… స్థానిక కౌన్సిలర్లు అంత్యక్రియలు నిర్వహించారు. మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు అనిల్ కుమార్, సజనపు స్వామి ముందుకొచ్చి శ్మశాన వాటికలో జేసీబీతో గుంత తీసి పూడ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఇర్ఫాన్, మున్సిపల్ సిబ్బంది, కరుణాకర్ పాల్గొన్నారు.
కరోనాతో మహిళ మృతి... అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్లు - భూపాలపల్లిలో కరోనాతో మహిళ మృతి
కరోనాతో మహిళ మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికంగా ఉండే కౌన్సిలర్లే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
jcb