తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కళకళలాడుతున్న గోదావరి జలాలను వీక్షిస్తే గొప్ప అనుభూతి కలుగుతోందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ తెలిపారు. గోదావరి సంకల్పయాత్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఆనకట్ట, లక్ష్మీ పంప్‌హౌస్ నిర్మాణాలు, నీటి ఎత్తిపోతలను తిలకించారు. ప్రకృతి రమణీయతో పరవశించిపోతున్నట్లు రాజేందర్‌సింగ్ తెలిపారు. ప్రాజెక్టు రూపకల్పన చేసిన ఇంజినీర్ల పాత్ర గొప్పదని కితాబునిచ్చారు. నీటిని ఒడిసిపట్టుకోవటమే కాకుండా... వినియోగించటమూ తెలిసినప్పుడే సార్థకత ఉంటుందని సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ