Villagers protest on wine shop transfer: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకం. చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటుచేశారు. ప్రజలు కొన్ని చోట్ల మద్యం అమ్మకం నిషేధించాలంటూ ధర్నాలు చేస్తుంటారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో మద్యం దుకాణం తరలించవద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
మద్యం దుకాణం యామనపల్లి గ్రామానికి మార్చడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. దుకాణం బలవంతంగా తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులు ఆధార పడి జీవిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?: షర్మిల
జైలులో పెడతారా పెట్టుకోండి.. దేనికైనా సిద్ధం: ఎమ్మెల్సీ కవిత