జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలోని బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టింది. అంబట్పల్లిలో 105 ఎంపీటీసీ పత్రాలు, 116 జడ్పీటీసీ పత్రాలకు చెదలు పట్టాయి. సురారంలో 17 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టినట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి నివేదిక అందిస్తామని తెలిపారు. అంబట్పల్లి, సురారం ఎంపీటీ స్థానాలు, మహాదేవపూర్ జడ్పీటీసీ స్థానం ఫలితం నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు