జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డును తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఆ వార్డు తెరాస అభ్యర్థి తొట్ల సంపత్ ఏకగ్రీవం అయ్యారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తొట్ల సంపత్కు మిఠాయి తినిపించి అభినంధనలు తెలియజేశారు.
తన గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. మిగిలిన 29 వార్డులలో తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎన్నికల ఇంఛార్జి గోవింద్ నాయక్, వరంగల్ మహానగర మేయర్ గుండా ప్రకాష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ప్రమాదకరమైన క్యాన్సర్కు త్వరలో అద్భుతమైన చికిత్స