జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 3రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి హుండీ ఆదాయం 20 లక్షల 29వేల 721 రూపాయలు వచ్చాయని ఆలయ కార్యనిర్వహక అధికారి సులోచన వెల్లడించారు. ఆలయ ప్రాకార మండపంలో లెక్కించగా నోట్ల ద్వారా రూ. 19,03,936 రూపాయలు, నాణెముల ద్వారా 1,25,785 రూపాయలు మొత్తం రూ. 20,29,721 ఆదాయం, 115 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 700 గ్రాముల మిశ్రమ వెండి సహా 66 విదేశీ కరెన్సీ నోట్ల ఆదాయం సమకూరింది.
దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియలో ఛైర్మన్ హింగే మహేందర్, గ్రామ సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీరాముల మహేందర్, గ్రామ కార్యదర్శి రమ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆపరేషన్ కరోనా: ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 53 మంది