జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యపూజలు, ధ్వజారోహణం, బలిహరణం, భేరిపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మేళతాళాల మధ్య అశ్వవాహనంపై ఊరేగింపుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య... ప్రధాన అర్చకుడు బుచ్చమాచార్యులు కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ఛైర్మన్ మహేందర్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇల్లు కూల్చొద్దని పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం