ETV Bharat / state

భూపాలపల్లిలోని సింగరేణి కార్మికుల సమ్మె - భూపాలపల్లి తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లిలోని సింగరేణి గనులలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించికోవాలని డిమాండ్​ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బొగ్గుగనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Singareni workers strike in Bhupalpally
భూపాలపల్లిలోని సింగరేణి కార్మకులు సమ్మే
author img

By

Published : Jul 2, 2020, 2:31 PM IST

కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లిలోని సింగరేణి గనులలో 72 గంటల సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా ఈ ఒక్క రోజు మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గుబ్లాక్​లను గత నెల 18న వేలం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను ధారాదత్తం చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందన్నారు.

మోదీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను సింగరేణి కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే మోదీ ప్రభుత్వం బొగ్గుగనుల వేలం పాటలను నిలిపివేసి ప్రభుత్వ రంగంలోనే సింగరేణి ఉంచాలన్నారు. కోల్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో బొగ్గు క్షేత్రాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అతితక్కువ జీతాలతో కాంట్రాక్టు కార్మిక విధానాలతో శ్రమ దోపిడీకి అవకాశం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించుకోకపోతే నిరవధిక సమ్మెకైనా సిద్ధమేనని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బొగ్గుగనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండీ : సమ్మె సైరన్.. సింగరేణిలో మూడురోజుల నిరసనలు షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.