జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రావడం వల్ల పీఎస్ ఎదురుగా ఉన్న జగ్గయ్యపేట రోడ్లో ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోయాయి. దాని వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రేగొండ ఎస్సై కృష్ణప్రకాశ్ గౌడ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని... రోడ్డుపై నుంచి చెట్లను పక్కకు తొలగించారు. దీనితో వాహనదారులు, బాటసారులు ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేశారు. రేగొండ ఎస్సై కృష్ణ ప్రకాశ్ గౌడ్‌ను వాహనచోదకులు, మండల ప్రజలు అభిందించారు.
ఇదీ చూడండి:- వలస కూలీల ఆగ్రహం- ఉత్తర భారతంలో ఉద్రిక్తత