ETV Bharat / state

'వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండండి' - bhupalap-ally news

శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా వైరస్​ వ్యాప్తి, వ్యవసాయ పనులు ప్రారంభంతో పాటు మిషన్​భగీరథ, పంచాయతీరాజ్​ శాఖలో జరుగుతున్న పనులపై చర్చించారు సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఎంపీపీ, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.

'వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండండి'

author img

By

Published : Jul 18, 2020, 5:19 PM IST

భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మండల ఎంపీపీ, వివిధ శాఖల అధికారులు, పీఎసీఎస్​ ఛైర్మన్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ అధికారులు హాజరయ్యారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, మండలంలో వైరస్​ తీవ్రతపై చర్చించారు. వర్షాలు సకాలంలో పడి నాట్లు మొదలైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంత మంది లబ్ధిదారులకు రైతు బంధు వచ్చింది, ఇంకా రాని వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సిద్ధం చేయలన్నారు. రైతు వేదికల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం విద్యా, పంచాయతీ రాజ్, ఉద్యానవన, మిషన్ భగీరథ పనులపై కూడా అధికారులు పలు సూచనలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.