ETV Bharat / state

'రిపబ్లిక్​ డే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి' - భూపాలపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ శ్రీనివాస్​ సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వేడుకలను కలెక్టరేట్​లో నిర్వహించనున్నారు.

republic day celebrations in bhupalapally, rdo review meeting
గణతంత్ర వేడుకలపై ఆర్డీఓ సమీక్ష
author img

By

Published : Jan 22, 2021, 2:50 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 26న రిపబ్లిక్​ డే దృష్ట్యా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.

కరోనా నిబంధనలు పాటించాలి

ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని కలెక్టరేట్​లో నిర్వహించాలని నిర్ణయించినందున కార్యాలయ ఆవరణను ముస్తాబు చేసి సిద్ధం చేయాలని అధికారులకు ఆర్డీఓ సూచించారు. వేడుకలకు వచ్చేవారికి కరోనా నిబంధనల మేర మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలన్నారు. అత్యవసర సేవల నిమిత్తం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పారు.

ప్రొటోకాల్​ పాటించాలి

వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని శ్రీనివాస్​ కోరారు. సంబరాలకు హాజరయ్యే వీఐపీలు, అతిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ శాఖకు సూచించారు. తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీ సహకారంతో ప్రాంగణాన్ని ముస్తాబు చేయాలని, ప్రొటోకాల్​ పాటిస్తూ వేడుకలు జరిగేలా చూడాలని అన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సుధార్ సింగ్, డీపీఆర్ఓ రవికుమార్, స్థానిక తహసీల్దార్ అశోక్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.