తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడం వల్ల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాళేశ్వర పథకం ప్రారంభోత్సవ క్రతువు ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా చేయనున్నందున... ఆ దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతోంది. దేశ ప్రధాని మోదీని కూడా కలిసి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ముఖ్య అతిథిలుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు దృష్ట్యా ఏర్పాట్లపై అధికారులు పరిశీలించారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారుల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్ద వద్దకు చేరుకొని పరిశీలించారు. ప్రారంభం చేసే సమయంలో బ్యారెజీ వద్ద నదీమా మాతకు ప్రత్యేక పూజలు ,హోమం, పైలాన్ ఆవిష్కరణ, గేట్లను ప్రారంభం వంచి అంశాలు సమీక్షించారు.
ఇవీ చూడండి: సీసీ రోడ్డు పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన