జయశంకర్ భూపాలపల్లి జిల్లా గడ్డిగాని పల్లి, సిగ్గంపల్లి గ్రామాల్లో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఎస్సై అనిల్ కుమార్ సూచించారు.
వాహనదారులు తప్పకుండా వెహికల్ రిజిస్ట్రేషన్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లను కలిగి ఉండాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై అనిల్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం