ETV Bharat / state

వానలకు నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక

గత కొద్ది రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చాలా మేర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు వర్షానికి దెబ్బతిన్న పంటలను గుర్తించి అంచనా వేస్తున్నామని, ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తగు సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

author img

By

Published : Aug 26, 2020, 1:54 PM IST

report on crop loss by jayashankar bhupalpally district
వానలకు నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యంబాబు తెలిపారు. జిల్లాలో వర్షాకాలం 96 వేల ఎకరాల వరి సాగు, 121 ఎకరాల పత్తి సాగు చేయగా.. ఆగస్టు 12 నుంచి 23 వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా వరి పంట పొలాలు నీట మునిగాయి. 25 వేల ఎకరాలు పత్తి , 8500 ఎకరాల మేర వరికి జరిగిన నష్టం అంచనా వేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యం తెలిపారు.

ఆగస్టులో వేసిన వరి నాట్లు వేసిన రైతులు పంట పొలంలో నీట మునిగి నష్టపోయారని.. వారు మళ్లీ వరి నాట్లు వేసుకోవాలని... ఆగస్టు కంటే ముందుగా వేసిన నాట్లకు యూరియా,పోటాష్ కలిపి చల్లుకోవాలని సత్యం సూచించారు. ప్రతి రైతు పంట చేను నష్టపోయినట్లయితే అంచనా వేసి ప్రతి రైతు నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.