ETV Bharat / state

రెండో డోసు టీకా వేయించుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ - తెలంగాణ న్యూస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి టీకా వేయించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఫీవర్​ సర్వేను పరిశీలించారు.

Telangana news
భూపాలపల్లి న్యూస్
author img

By

Published : May 25, 2021, 5:15 PM IST

లాక్​డౌన్​ పెట్టడం వల్ల కొవిడ్​ కట్టడిలో సఫలీకృతులమయ్యామని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ఆయన రెండో డోసు వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

అనంతరం ఇందిరా భవన్​ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిపోర్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని 25 వార్డులో నిర్వహిస్తున్న ఫీవర్​ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్​కు సహకరిస్తే కొవిడ్​ మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​, ఆర్డీవో, డీఎంహెచ్​వో, ఎమ్మార్వో, స్థానిక కార్యకర్తలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.