కరోనా మహమ్మారిని మనోబలంతో మాత్రమే ఎదుర్కోగలమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలో పర్యటించిన ఆయన... కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు. కొవిడ్ బారిన పడిన రిపోర్టర్‌ను కలిసి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. అతనికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే.. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణ వీధుల్లో పర్యటించి.. శానిటైజేషన్ వివరాలు ఆరా తీశారు. కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర కోరారు.
- ఇదీ చూడండి : ఇలా అయితే.. కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు!