ETV Bharat / state

'కేటీఆర్​ని సీఎంగా నియమిస్తే మద్దతు ఇస్తాం'

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర పంపిణీ చేశారు. సీఎంగా కేటీఆర్​ని నియమిస్తే మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు.

MLA Gandra Venkata Ramana Reddy  distributed kalyanalaxmi, shadi mubarak cheques
'కేటీఆర్​ని సీఎంగా నియమిస్తే.. మద్దతు ఇస్తాం'
author img

By

Published : Jan 21, 2021, 8:42 PM IST

సీఎం కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్​ పాలనను కొనియాడారు.

బుద్ధి చెప్తారు..

ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చాడని తెలిపిన ఆయన.. ఇటీవల ముఖ్యమంత్రిపై బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భాజపా నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

సీఎంగా కేటీఆర్​..

కేటీఆర్​ని సీఎంగా నియమిస్తామంటే వారికి తెరాస ఎమ్మెల్యేలు ఏకపక్షంగా మద్దతు ఇస్తారని తెలిపిన గండ్ర.. యువనాయకుడి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. అనంతరం ఘన​పూర్​ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:'సీరం'​లో అగ్ని ప్రమాదం.. అదుపులోకి మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.