ETV Bharat / state

Etela on Godavari Flood Victims : 'మాటలు మాని.. వరద బాధితులను ఆదుకోండి' - గోదావరి వరద బాధితులపై ఈటల వ్యాఖ్యలు

Etela on Godavari Flood Victims : గోదావరి వరదలతో జనం అల్లాడుతుంటే వారి గురించి పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతరులపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం చేస్తోందని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మాటలు చెప్పడం మాని వరద బాధితులను ఆదుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు.

Etela on Godavari Flood Victims
Etela on Godavari Flood Victims
author img

By

Published : Jul 20, 2022, 1:31 PM IST

మాటలు మాని.. వరద బాధితులను ఆదుకోండి

Etela on Godavari Flood Victims : గోదావరి వరదలతో జనం అల్లాడుతుంటే.... ఇతరుల మీద నెపం నెట్టి కేసీఆర్‌ సర్కార్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భూపాలపల్లిలో జరిగిన భాజపా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మాయమాటలతో తెరాస సర్కార్‌ కాలం గడుపుతుందన్న ఈటల.... కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఎవరూ నమ్మడం లేదన్నారు. వరదలతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు చెప్పకుండా, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

"వరదలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారు. వాళ్లని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఇతరుల మీద నెపం నెడుతోంది. భద్రాద్రి ప్రజల గోడు సర్కార్‌కు వినిపించడం లేదా..? మాటలు చెబుతూ కాలయాపన చేయడం మాని బాధితులను ఆదుకోవాలి. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బాధితులకు పరిహారం ఇచ్చి సాయంగా నిలవాలి." - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.