తెరాస ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొని ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, జర్నలిస్టులు రక్తదానం చేశారు.