Medigadda Barrage Issue Update : మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి మరో 15 అంశాల సమాచారాన్ని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కేంద్రానికి అందించారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority)కి ఈ మేరకు రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు వివరాలు అందించారు. మిగిలిన రెండు అంశాల సమాచారాన్ని త్వరలోనే ఇస్తామని రాష్ట్ర అథారిటీ తెలిపింది. కుంగిన అనంతరం మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన కేంద్ర బృందం మొత్తం 20 అంశాలపై వివరాలు కోరింది. అందులో మూడింటి సమాచారాన్ని గతంలోనే అందించారు. మిగిలిన 17 అంశాల సమాచారం 29వ తేదీ లోపు ఇవ్వాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కోరింది. అందులో 15 అంశాల సమాచారాన్ని రాష్ట్ర అథారిటీ అందించింది.
ఈనెల 23 నుంచి 26వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణాన్ని కేంద్ర కమిటీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యారేజీలో పియర్‌కు పగుళ్లకు సంబంధించిన అంశాలపై కోరిక సమాచారం వెంటనే ఇవ్వాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ మరో లేఖను రాసింది. ఈ విషయాలపై ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొంది.
Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం
Medigadda Barrage Damage at Bhupalaplly : ఈ మేరకు అంతకు ముందు ఇచ్చిన మూడు అంశాలతో పాటు, మరో 15 అంశాల సమాచారాన్ని జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులకు అందించారు. వారు కేంద్రానికి ఈ నివేదికను సమర్పించారు. మరో రెండు అంశాలపై త్వరలో సమాచారం ఇస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు కేంద్ర జలమంత్రిత్వ శాఖ డైరెక్టర్ కూడా లేఖ రాశారు.
Central Committee Inspected Medigadda Barrage : అయితే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నీటి పారుదల శాఖ జనరల్ ఈఎన్సీ మురళీధరన్ మాత్రం నిర్మాణంలో లోపాలు లేవని చెప్పారు. కానీ చివరన మెలిక పెడుతూ ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అన్నారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగిందని తెలిపారు. ఇసుక వల్ల ఈ సమస్య వచ్చి ఉంటుందని అనుమానించారు. కాఫర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబరు చివరలో ఇందుకు సంబంధించిన పూర్తి దర్యాప్తును చేస్తామని వివరణ ఇచ్చారు.
అసలేం జరిగింది : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరి నదిపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని.. రెండేళ్లలో పూర్తి చేసింది. ఇది కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే బ్యారేజీలో 10 టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇంజినీర్లు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల రాకపోకలను నిలిపివేశారు. దానికి గల కారణాన్ని పరిశీలించిన అధికారులు బీ-బ్లాకులోని 18,19,20,21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు.