కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండోదశ విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యాయి. 54 రోజుల విరామం తరువాత ఈ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి మళ్లీ మొదలైంది. ఉత్పత్తి అయిన 600 మెగావాట్ల విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నట్లు కేటీపీపీ అధికారులు తెలిపారు. యూనిట్‌లోని జనరేటర్‌లో సమస్యలు వచ్చినందున డిసెంబర్ 13నుంచి కేటీపీపీ రెండో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రోటార్ బాగు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొత్త రోటార్‌ను అధికారులు కొనుగోలు చేశారు. రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో... కేటీపీపీలో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి.