జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు జాగరణలో ఉండి పోయారు.
శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర-ముక్తీశ్వరా స్వామి వారి దర్శనం చేసుకుని.. స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. సాయంత్రం 4.00 గంటలకు ఆది ముక్తీశ్వరా స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఇదీ చదవండి: కంటికి రెప్పలా కాపాడుకుంటే.. కనీసం పట్టించుకోవట్లేదు..!