జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రియల్ చెక్ అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దల్ అజీం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదని అలాంటి అదృష్టవంతులలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకరని కొనియాడారు.
ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేటాయించే ప్రతి పైసా ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, డీపీఓ చంద్రమౌళి, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.