ETV Bharat / state

వైద్యశాఖ అధికారులతో.. కలెక్టర్​ సమీక్షా సమావేశం! - జయశంకర్​ భూపాలపల్లి జిల్లా వార్తలు

పవర్​ ఫైనాన్స్​ కార్పోరేషన్​ వారి సీఎస్​ఆర్​ నిధులతో వైద్య, ఆరోగ్య శాఖలో వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్​ అబ్దుల్​ అజీం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా వైద్య శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Jaya Shankar Bhupalapally Collector meeting With Medical And Health Officials
వైద్యశాఖ అధికారులతో.. కలెక్టర్​ సమీక్షా సమావేశం!
author img

By

Published : Sep 3, 2020, 10:49 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పవర్​ ఫైనాన్స్​ కార్పోరేషన్​ వారి సీఎస్​ఆర్​ నిధులతో వైద్య, ఆరోగ్య శాఖలో వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్​ సుధార్​ సింగ్​ను ఆదేశించారు. ఆస్పిరేషనల్​ డిస్ట్రిక్​ కార్యక్రమంలో ఉమ్మడిగా ఎంపికైన జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైద్య సదుపాయాల కల్పనకు గత సంవత్సరం పవర్​ ఫైనాన్స్​ కార్పోరేషన్​ వారి సీఎస్​ఆర్​ నిధుల నుంచి రూ.8 కోట్ల 74 లక్షల నిధుల నుంచి పది శాతం ఖర్చు చేశామని, లాక్​డౌన్​ వల్ల మిగతా నిధులను సకాలంలో ఖర్చు చేయకపోయామని తెలిపారు.

జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి మేరకు పవర్​ ఫైనాన్స్​ కార్పోరేషన్​ సంబంధిత నిధులతో జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైద్య సదుపాయాల కల్పనకు మరో ఆరు నెలల వ్యవధి ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. బై డిస్ట్రిక్ లెవెల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎస్​ఆర్​ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, ఫర్నిచర్, అంబులెన్స్​ల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ నారాయణ, డీఐఓ డాక్టర్ ఉమాదేవి, కరోనా వైరస్ నియంత్రణ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జైపాల్, డాక్టర్ భాష్య నాయక్, సీపీఓ బిక్షపతి, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, సూపరింటిండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.