ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లించిన సంస్థ ఇదే.. - అత్యధిక పన్ను చెల్లించిన సంస్థ

రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన సంస్థగా సింగరేణి రికార్డు సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపు అవార్డును సింగరేణి సంస్థ బుధవారం అందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖకు రూ.750 కోట్ల పన్నును చెల్లించింది.

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక పన్ను చెల్లించిన సంస్థ
author img

By

Published : Jul 25, 2019, 10:03 AM IST

సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపు అవార్డును బుధవారం అందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖకు రూ.750 కోట్ల పన్నును చెల్లించి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక పన్ను చెల్లించిన సంస్థగా రికార్డు సాధించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో 159వ ఆదాయపు పన్ను దినోత్సవం ఉత్సవాల్లో సింగరేణికి ఈ అవార్డును అందజేశారు. సంస్థ ఫైనాన్స్‌ సంచాలకులు బలరాం నల్సార్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫైజాన్‌ముస్తఫా నుంచి అవార్డును అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఆదాయపు పన్ను ప్రిన్సిపల్‌ ముఖ్య కమిషనర్‌ ఎన్‌.శంకరన్‌, ఇన్వెస్టిగేషన్‌ డీజీ ఆర్‌.హెచ్‌.పాలీవాల్‌, ముఖ్య కమిషనర్‌ అతుల్‌ప్రణయ్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018-19లో రూ.25,828 కోట్ల వ్యాపారం చేసిందని, అందులో రూ.750 కోట్లు ఆదాయపు పన్ను కింద చెల్లించిందన్నారు. సింగరేణి సంస్థ గత ఐదేళ్లలో 116 శాతం వృద్ధిని సాధించిందని సంస్థ ఫైనాన్స్‌ సంచాలకులు బలరాం తెలిపారు. లాభాలు 282 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని వెల్లడించారు.

ఇదీ చూడండి : శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.