రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 15 కోట్లతో 92 ఎకరాలు సేకరణతో పాటు 23 ఎకరాలు పీఓటీ కింద తీసుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణకు నిధులు విడుదల చేసింది. యూనివర్సిటీని ఏర్పాటు చేసే వైటీసీ మరమ్మతుల కోసం ఐటీడీఏ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలోనే తరగతుల నిర్వహణపై స్పష్టత రానుంది. ఇంతకు ముందు ఈ నిధులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పేరు మీదుగా వచ్చాయి. జిల్లా మారడంతో తిరిగి ములుగు జిల్లా కలెక్టర్ పేరు మీదుగా సవరించి నిధులు మంజూరు చేశారు. నిధుల కోసమే స్థల సేకరణ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇక స్థల సేకరణ వేగవంతం కానుంది.
కోట్ల ప్రతిపాదనలు
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాత్కాలికంగా భవనసముదాయాలను అధికారులు గుర్తించారు. ములుగు సమీపంలోని జాకారం వద్ద నున్న వైటీసీ భవనాన్ని వినియోగించుకునేందుకు అధికారులు సుముఖత తెలిపారు. ఇదివరకే ఈ భవనాన్ని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అధికారులు, కేంద్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ పరిశీలించారు. భవనం మరమ్మతులు, విద్యార్థినీవిద్యార్థులకు వేర్వురుగా వసతి గృహాల ఏర్పాటుకు కూడా కేంద్రానికి ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం నుంచి ప్రతిపాదనలు పంపారు. వైటీసీ మరమ్మతుల కోసం రూ. 1.89 కోట్లు, బాలుర వసతి గృహం కోసం రూ. 69 లక్షలు, బాలికల వసతి గృహం కోసం రూ. 63 లక్షలు మొత్తం 3.17 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించారు.
కేంద్ర నిర్ణయంపైనే
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మా తరఫున సిద్ధంగా ఉన్నాం. స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. వైటీసీ మరమ్మతుల కోసం కేంద్ర సీపీడబ్ల్యూడీకి ప్రతిపాదనలు పంపించాం. కేంద్ర నిర్ణయంపైనే తరగతుల ప్రారంభం ఆధారపడి ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని పీఓ, ఐటీడీఏ ఏటూర్‌నాగారం చక్రధర్ తెలిపారు.
ఇదీ చూడండి : గందరగోళంగా ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ