ఇవీ చూడండి: వీడు మామూలోడు కాదు... లారీలనే ఎత్తుకెళ్లాడు
416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన - మ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భాస్కర్ గడ్డలో 416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. పేద ప్రజల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 549 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మరో 416 ఇళ్లకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భాస్కర్ గడ్డ గ్రామంలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు 22 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా 549 డబుల్ బెడ్రూం ఇళ్లు, 100 పడకల గది ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమం ఉంటుదని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: వీడు మామూలోడు కాదు... లారీలనే ఎత్తుకెళ్లాడు
sample description