బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వరుణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఒక్కరోజులోనే జిల్లాలో వందశాతానికి పైగా వర్షపాతం నమోదైంది. రేగొండ మండంలంలో అత్యధికంగా 34.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా మహదేవపూర్‌లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలోని మండలాల వారీగా మహాముత్తారం 20.4, మొగుళ్లపల్లి 12.2, భూపాలపల్లి 8.6, గణపురం 6.2, మల్‌హర్‌రావు 4.2, చిట్యాల 3.8, మహదేవపూర్ 2.4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా పలు మండల్లాలోని చెరువులు, వాగులు నిండుకుండలను తలపిస్తున్నాయి.