జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్లో ఒక కోటి 50 లక్షలతో వేయనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 15 లక్షలతో బీటీ రోడ్డు, రూ. 13 లక్షలతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.
30 రోజుల ప్రణాళికను మళ్లీ అదే విధంగా నిరంతరం కొనసాగించాలని అన్నారు. స్థానిక సర్పంచ్ గ్రామ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామాలకు సంబంధించి సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన రేగొండలో అన్ని రకాల సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య