జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల మానేరు నుంచి, మహారాష్ట్రలో కురిసే వర్షాల వల్ల ప్రాణహిత వరద నీరు చేరుతోంది.
కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద గోదారమ్మ నిండుగా ప్రవహిస్తోంది. సాధారణ, వీవీఐపీ ఘాట్లో కొన్ని మెట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద 11 మీటర్ల మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది.
ఇవీ చూడండి : గోదావరి అందాలు... కృష్ణమ్మ పరవళ్లు