ETV Bharat / state

రెండేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా: గండ్ర - భూపాలపల్లి వార్తలు

తాను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.

gandra press meet on bhupalpally development
రెండేళ్లలో నియోజకవర్గాన్ని లో ఎంతో అభివృద్ధి చేశా: గండ్ర
author img

By

Published : Dec 18, 2020, 3:53 PM IST

Updated : Dec 18, 2020, 4:58 PM IST

అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో కలెక్టర్ కార్యాలయంతోపాటు డిగ్రీ కళాశాల, మున్సిపాలిటీ నిధులతో నూతన భవన నిర్మాణం, నియోజకవర్గంలో 2 కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్మాణాలు జరిగాయని స్పష్టం చేశారు.

పట్టణానికి నలువైపులా నాలుగు శ్మశానవాటికలు నిర్మించామని తెలిపారు. డ్రైనేజీ, నాలాలు, మంచి నీటి వ్యవస్థను పునరుద్ధరించామని గుర్తుచేశారు. జెన్కోలో 500 క్వార్టర్స్, వాగులపై చెక్​డ్యాంల నిర్మాణ పనులు, అలాగే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు గండ్ర వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Last Updated : Dec 18, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.