ETV Bharat / state

Problems For Farmers In Bhupalapally : ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించినా రైతుకు తప్పని కష్టాలు

Grain Farmers Face Problems : కల్లాల వద్ద సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన ధాన్య బస్తాల్ని 5 రోజుల క్రితం కాంటా వేశారు. వాటిని మిల్లుకు తరలించేందుకు వాహనాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 3 రోజుల క్రితం వచ్చిన గాలిదుమారంతో బస్తాలపై కప్పిన పరదాలు కొట్టుకుపోయాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Grain Farmers
Grain Farmers
author img

By

Published : May 25, 2023, 3:37 PM IST

Grain Farmers Face Problems : రైతన్న పంటను సాగుచేయడం ఎంత కష్టమో. సకాలంలో అమ్ముకోవడం అంతకంటే ఎక్కువ కష్టంగా మారింది. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు కొనుగోలు కేంద్రాల్లోనూ అవస్థలు పడుతున్నారు. పంటకోసి కేంద్రాల వద్దకు తీసుకొస్తే సకాలంలో లోడింగ్ కావడం లేదు. మిల్లుల్లో దిగుమతిలోనూ జాప్యమే అవుతోంది. దీంతో వారు పడిగాపులు కాస్తున్నారు. పైగా తూకంలో అడ్డగోలు కోతలు విధిస్తూ ఆరుగాలం కష్టం దోపిడీ చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాదాపు 20 రోజులుగా కేవలం 18 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులు పడుతున్న కష్టాలు అన్నీ జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నాయి.

జిల్లాకు కేవలం 7 మిల్లులు మాత్రమే కేటాయింపు : రేగొండ మండలంలో మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేక, మార్కెటింగ్ శాఖకు చెందిన గోదాంకు వాహనాల్ని తరలిస్తున్నారు. అయితే అక్కడా హమాలీల్లేక ధాన్యం బస్తాలు కిందకు దించడం లేదు. చిట్యాల మండలంలోనూ రైస్ మిల్లులు, వే బ్రిడ్జి వద్ద ధాన్యం వాహనాలు బారులు తీరాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అధికారులు అట్టహాసంగా ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో రైతుకు అడుగడుగునా కష్టాలు తప్పటం లేదు. కేంద్రాల్లోకి ధాన్యం తీసుకొని వచ్చిన తర్వాత లోడింగ్​ కాక రైతులు కంటి మీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు. జిల్లాకు కేవలం 7 మిల్లులు మాత్రమే కేటాయించడంతో ధాన్యం దించుకోవడం ఇబ్బందిగా మారింది. మిల్లుల్లో వానాకాలం ధాన్యం కూడా ఉండటంతో నిల్వ చేసేందుకు స్థలం కొరత ఏర్పడుతోందని ఆవేదన చెందారు.

"రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో.. 15 రోజుల క్రితం కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చాను. 5 రోజుల క్రితమే కాంటా చేసుకున్నారు. బస్తాలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. లారీలు రావడం లేదు. నిత్యం కాపాలా కాయాల్సి వస్తోంది. మూడు రోజుల క్రితం గాలి దుమారంతో పరదాలు కొట్టుకుపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న వడ్ల బస్తాలు రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనివి.. 1200 బస్తాలు కాంటా అయ్యి మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మూడు రోజులుగా ఇక్కడికి లారీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. అలాగే 5 వేల బస్తాలు కాంటాకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రంలో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయని" - పంచగిరి కుమారస్వామి, రైతు

బస్తా ధాన్యానికి 3 కిలోలు తీసేస్తున్నారు : ధాన్యాన్ని చెంచుపల్లి గోదాంకు తీసుకువచ్చి.. మూడు రోజులుగా నిరీక్షిస్తున్నామని కొత్తపల్లి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ సరిగ్గా హమాలీలు లేరని.. దీంతో పడిగాపులు కాస్తున్నామన్నారు. రైతే రాజని అందరూ అంటూ ఉంటారు.. కాని రైతంత అధ్వానమైన బతుకు ఇంకా ఎవరికి ఉందడని కన్నీరు పెట్టుకున్నారు. తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధిస్తున్నారు. 18 శాతం తేమ వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని బస్తాలు నింపి కాంటా వేస్తున్నారని తెలిపారు. కేంద్రాల్లో కిలో, మిల్లు వద్ద మరో కిలో తరుగు పేరిట కోతలు విధిస్తున్నారని వాపోయారు.

ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిన.. రైతుకు తప్పని కష్టాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.