ETV Bharat / state

బొగ్గు తవ్వకాలు.. ఆవేదనతో పంటకు నిప్పు పెట్టిన రైతులు

బొగ్గు తవ్వకాలతో పంటలు పాడవుతున్నాయనే ఆవేదనతో రైతులు పొలానికి నిప్పుపెట్టారు. భూగర్భజలాలు తగ్గి నోటి కొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. కాళేశ్వరం నీళ్లతో తమ ప్రాంతంలోని చెరువులు నింపాలని కోరుతున్నారు. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

author img

By

Published : Apr 28, 2021, 9:33 AM IST

Updated : Apr 28, 2021, 9:40 AM IST

farmers set fire to crop, farmers protest
పంటకు నిప్పు పెట్టిన రైతులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతుల ఆవేదన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో రైతులు వరి పంటకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. రెండు పంటలు పండే భూములు. పొలాల పక్కనే ప్రధాన రహదారి. 150 అడుగు లోతులో నీరు. అంతా సంతోషంగా ఉందనుకున్న సమయంలో బొగ్గు తవ్వకాలు తమ బతుకులను ఆగం చేశాయని రైతుల కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏఎమ్మార్ కంపెనీ చేపట్టిన తవ్వకాలతో భూగర్భజలాలు 600 అడుగుల లోతుకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాలు బీడు భూములుగా మారాయని వాపోయారు.

పంటను కాపాడుకోవడానికి బోరు వేసినా... చుక్క నీరు రాలేదనే ఆవేదనతో పొలాలకు నిప్పు పెట్టారు. రైతులను 200 ఎకరాల్లోని పంట ఎండిపోయిందని 80మంది రైతులు కన్నీరుమున్నీరయ్యారు. బొగ్గు తవ్వకాలతో పొలాలు ఎడారులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టబడి పెట్టడం... పంటలు ఎండిపోవడం రెండేళ్లుగా జరుగుతూనే ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు స్పందించి మేడిగడ్డ జలాలతో తమ ప్రాంత చెరువులు నింపాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా పేరుతో ధరలు పెంచేస్తున్నారు

Last Updated : Apr 28, 2021, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.