What Happens to Your Body Daily Eat Boiled Eggs : శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని చాలా మంది డైలీ ఒకటి నుంచి రెండు ఉడకబెట్టిన గుడ్లను(Eggs) తింటుంటారు. మీరూ అలాగే తింటున్నారా? అయితే, అలా రోజూ బాయిల్డ్ ఎగ్స్ తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? లేదు.. అంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.
నిజానికి రోజూ కనీసం ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి : విటమిన్లు A, D, E, B12, ఫోలేట్, ఐరన్, భాస్వరం, సెలీనియంతో శరీరానికి అవసరమైన మరికొన్ని పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి.. డైలీ ఉడికించిన గుడ్డు తీసుకోవడం ద్వారా లభించే ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు.
కండరాలు బలంగా తయారవుతాయి : ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలలో గుడ్డు ఒకటి. కాబట్టి డైలీ ఉడికించిన గుడ్డును తీసుకోవడం ద్వారా లభించే ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు వంటివి కండరాలు బలంగా తయారవ్వడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు. అంతేకాదు.. దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయడంలో ఇవి సహాయపడతాయని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగు : గుడ్డులో కొలెస్ట్రాల్(Cholesterol) కంటెంట్ ఉన్నప్పటికీ.. మితంగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా దోహదపడుతుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ శుభాంగి తమ్మళ్వార్. ముఖ్యంగా ఎగ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.
షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?
మెదడు పనితీరు మెరుగుపడుతుంది : గుడ్లలో కోలిన్(National Library of Medicine రిపోర్టు) పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి, అభిజ్ఞా పనితీరుకు అవసరమైన పోషకం. కాబట్టి.. డైలీ ఒకటి లేదా రెండు ఉడికించిన ఎగ్స్ తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు మొత్తం మెదడు పనితీరు మెరుగుపడుతుందంటున్నారు డాక్టర్ శుభాంగి.
బరువు కంట్రోల్ : గుడ్డులో తక్కువ కేలరీలు ఉంటాయి లుంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల అతిగా తినకుండా ఉండవచ్చంటున్నారు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.
మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు : గుడ్డులో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎగ్ తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తినీ అందిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లు తినే వారి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్. అదే సమయంలో.. కొందరిలో డైలీ బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
అలర్జీలు : రోజూ బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల కొందరిలో అలర్జీలు రావొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. చర్మంపై దద్దర్లు, ఎర్రగా మారడం వంటి సమస్యలున్న వారు కొన్ని రోజులు గుడ్లను తినకపోవడమే బెటర్ అంటున్నారు.
గుండె జబ్బులు : శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్న వారు రోజూ ఎగ్‌ను తినడం వల్ల ఇంకా కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట. దీనివల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు : అంతేకాదు.. కొంతమందిలో డైలీ గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలూ రావొచ్చంటున్నారు నిపుణులు. చివరగా.. మీరూ రోజూ ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్ - ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయో మీకు తెలుసా?