జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలోని 1, 2, 3, 6, 7 వార్డుల్లో అభివృద్ధి పనులను పంచాయతీ పాలకవర్గం తిర్మనాలతో చేపట్టాలని డీపీఓ ఆశలత స్పష్టం చేశారు. పాలకవర్గాన్ని, ఎంపీడీఓ నరసింహమూర్తి, కార్యదర్శి సత్యనారాయణలను ఆ మేరకు ఆదేశించారు. గ్రామ వార్డు సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
అసంతృప్తి వ్యక్తం..
వార్డుల్లో అభివృద్ధి పనులకు డేంజర్ జోన్ పేరుతో అధికారులు ఆటంకం కల్గిస్తున్నారని పలు ఆరోపణలు చేస్తూ ఎంపీడీఓకు వార్డు సభ్యులు ఇటీవల ఫిర్యాదు చేశారు. డేంజర్ జోన్లో ఉన్నట్లుగా ఎలాంటి రాత పూర్వక ఆధారాలు లేనందున.. సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీల పనులు సీఎస్ఏఫ్ నిధుల నుంచి చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం అద్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మినహాయింపు ఇవ్వాలి..
శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని.. పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు శ్రద్ధ చూపాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో పని ఒత్తిడితో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కార్యదర్శి జగన్నాథ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈజీఎస్ పనుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని మండలంలోని గ్రామాల కార్యదర్శులు డీపీఓకి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్యనారాయణ, పంచాయితీ కార్యదర్శులు, వార్డు సభ్యులు బండి స్వామి, ఇందారపు సది, బుడిద స్వరూప, పైడాకుల దేంవేంద్ర, గంగన్న, కుంట సదానందం, సత్యనారాయణ, ఓదేలు, దండు రమేష్, మల్క మధుసూదన్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు