ETV Bharat / state

'హరితహారం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలి'

జూన్​ 20 నుంచి ప్రారంభమవుతన్న హరితహారం ద్వారా జయశంకర్​ భూపాలపల్లి జిల్లాను పచ్చదనంతో నింపేయాలంటూ కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 లోపు జిల్లాలో ఫారెస్ట్ గార్డెన్, మియావాకి పూర్తి చేయాలని తెలిపారు.

collector visit at singareni in bhupalpally
'హరితహారం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలి'
author img

By

Published : Jun 11, 2020, 2:47 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ సింగరేణి, ప్రభుత్వ అధికారులతో కలిసి మంజూరునగర్​లోని సింగరేణి నర్సరీని, గార్డెన్​ను పరిశీలించారు. జూన్​ 20 నుంచి ప్రారంభంకానున్న హరితహారం ద్వారా చెల్పూర్​ నుంచి రేగొండ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వనున్నారు.

ఆగస్టు 14 లోగా జిల్లాలో ఫారెస్ట్​ గార్డెన్, మియావాకి ఏర్పాటు పూర్తి చేయాలంటూ కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణంలోనూ పచ్చదనం కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, సింగరేణి జీఎం, మున్సిపల్​ కమిషనర్​, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.