జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పర్యటించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు. సుల్తాన్ పూర్, చిన్నకోడెపాక, దమ్మన్నపేట, మడతపల్లి, కాకర్లపల్లి, బాగిర్తిపేటలో గ్రామాల్లో పర్యటించి రైతు వేదికలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని నాణ్యతగా... వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఈనెల 20లోగా నిర్మాణాలు పూర్తి చేసి 23 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ ఆత్మారాం, ఏఈ సతీశ్ బాబు, స్థానిక సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.