ETV Bharat / state

నేను డాక్టర్​ అవుదామనుకున్నా.. కానీ కలెక్టర్​ అయ్యా..

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సింగరేణిలో ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ, సింగరేణి శాఖ ఆధ్వర్యంలో నేషనల్​ డాక్టర్​డేని జిల్లా కలెక్టర్​ అబ్దుల్​ అజీం ప్రారంభించారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులే రియల్​ హీరోస్​ అని ఆయన కొనియాడారు.

author img

By

Published : Jul 1, 2020, 5:15 PM IST

collector abdhul ajeem participated in national doctors day celebrations in jayashankar bhupalapally
నేను డాక్టర్​ అవుదామనుకున్నా.. కానీ కలెక్టర్​ అయ్యా..

ప్రజల ప్రాణాలను కాపాడే రియల్ హీరోలు వైద్యులని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్​లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేటు వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అబ్దుల్​ అజీం హాజరయ్యారు.. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నేషనల్ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రజలకు సోకకుండా ముందు వరుసలో ఉండి వైద్య సేవలు అందిస్తున్న వారు వైద్యులని అలాంటివారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కలెక్టర్​ తెలిపారు. వైద్య వృత్తి చాలా గొప్పదని ఏదేని కారణాల వలన కూడా వైద్యులపై ప్రజలు దాడులు చేయరాదని, దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాకు వైద్య వృత్తి అంటే చాలా ఇష్టమని నేను డాక్టర్​ని కావాలనుకున్నాను కానీ కాలేక పోయానంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేశారు.

ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్​.. మధురై వైద్యుడి ఘనత!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.