జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్పంచ్ మాసు రాజయ్య(48) అనారోగ్యంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు.. సర్పంచ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిట్యాల సర్పంచ్‌గా.. ఉపసర్పంచ్‌కు బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లోకి రాకముందు మాసు రాజయ్య రిపోర్టర్‌గా విధులు నిర్వహించేవారు. సర్పంచ్‌గా రాజయ్య.. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేవారని గ్రామస్థులు తెలిపారు.
- ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా