నాటు బాంబు పేలి గేదె మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో జరిగింది. బర్రెల కాపరి పిరాల రాజయ్య రోజూలాగే వాటిని మేపేందుకు సమీపంలోని గుట్ట ప్రాంతానికి వెళ్లాడు. అదే సమయంలో గుర్తు తెలియని వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు పేలింది.
ఈ ఘటనలో గేదె ముఖానికి తీవ్రగాయాలు కావడంతో సృహతప్పి పడిపోయింది. అధిక రక్తస్రావమై మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన బర్రెకు నష్ట పరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతు శివ వేడుకుంటున్నాడు.