జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారంతో డీపీఓ సుధీర్ బాబు, తహసీల్దార్ అశోక్ వెంటనే వెళ్లారు. హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
![Brain stroke to Jayashankar District Additional Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_wgl_46_03_adtinal_collector_aswastatha_av_ts10069_0310digital_1601715813_462.jpg)
వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తహసీల్దార్ అశోక్ పేర్కొన్నారు. పని ఒత్తిడితోనే ఆయన అనారోగ్యం పాలైనట్లు పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
అదనపు కలెక్టర్‌తో పాటు భూపాలపల్లి ఆర్డీఓ, జడ్పీ సీఈఓ, డీఆర్డీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనపు కలెక్టర్ త్వరగా కోలుకోవాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చదవండి: మంత్రి ఐనా ఊరిలో సామాన్యుడే... పన్ను కట్టిన ఎర్రబెల్లి