ETV Bharat / state

'ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి సిద్ధంకండి' - కలెక్టర్ అబ్దుల్ అజీం ప్రత్యేక సమావేశం

జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ముందస్తుగా నిర్వహించాలని కలెక్టర్ మహ్మద్ద్ అబ్దుల్ అజీం అధికారులకు సూచించారు. భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్ హౌస్​లో పలువురు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. .

bhupalpally collector abdul azim special sanitation program in bhupalpally district
'ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంకు సిద్ధంకండి'
author img

By

Published : May 29, 2020, 8:39 PM IST

భూపాలపల్లి జిల్లా ఇల్లందు క్లబ్ హౌస్​లో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపాలిటీ సిబ్బందితో జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం సమావేశం నిర్వహించారు. జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ, వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటేషన్ చేయాలన్నారు. చెత్త మొక్కల తొలగింపు, మురుగు కాలువల పూడికతీత, బురద గుంటలను గుర్తించి వాటిని పూడ్చి వేయడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.

ప్రతి ఆదివారం..

ఈనెల 30 వరకు వార్డుల వారీగా పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి ప్రణాళిక ప్రకారం జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు చేయాలన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు పట్టణంలోని ప్రజలు ఇళ్లలో పాత కుండలు, టైర్లు, కూలర్లు ఇతర నీరు నిల్వ ప్రాంతాలు ముందస్తుగా శుభ్రపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్ శెగ్గెం వెంకటరాణి, వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఆవేదనతో ఉన్న అసంఘటిత కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.