ETV Bharat / state

బ్యాంకు అధికారులు... రైతులను పదే పదే తప్పి పంపొద్దు : కలెక్టర్ - mla gandraramana reddy

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సింగరేణి క్లబ్ హౌస్​లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధికి బ్యాంకు యంత్రాంగం ఆర్థిక సైనికులుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సూచించారు.

బ్యాంకు అధికారులు... రైతులను పదే పదే తప్పి పంపొద్దు : కలెక్టర్

author img

By

Published : Sep 5, 2020, 9:07 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్​ హౌస్​లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి ప్రభుత్వ రుణాలపై సమీక్షించారు. స్కీముల వారీగా రుణాల మంజూరుపై ఎల్డీఎం శ్రీనివాస్ వివరించారు.

సకాలంలో అందించాలి...

పేదల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ఆర్థిక రుణ పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. వాటిని జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు సకాలంలో అందించాలన్నారు. ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రతి బ్యాంకర్ ఆర్థిక సైనికులుగా పని చేయాలని స్పష్టం చేశారు. బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం వలన వివిధ రకాల రుణాలను సకాలంలో అందించగలిగామని పేర్కొన్నారు.

వారికి కూడా త్వరగానే...

డీఆర్డీఏ దారా లక్ష్యానికి మించి 114 శాతం రుణాలను మహిళా సంఘాలకు అందించినట్లు వెల్లడించారు. యువతకు స్వయం ఉపాధి రుణాలను, వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్ రుణాలను, రైతులకు పంట రుణాలను త్వరగా అందించాలని బ్యాంకర్లను కోరారు.

ఇప్పటివరకు 10 శాతమేనా ?

జిల్లాలోని ప్రతి వ్యవసాయ భూమికి వంద శాతం సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించినందున రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలన్నారు. ఇప్పటివరకు 10 శాతం మాత్రమే పంట రుణాలను అందించడం సమంజసం కాదని హితవు పలికారు.

బ్యాంకుల చుట్టూ తిప్పుకోవద్దు...

రైతుల నుంచి రుణాల రికవరీ బాగుంటుంది కాబట్టి వారిని బ్యాంకుల చుట్టు తిప్పుకోకుండా వెంటనే పంట రుణాలు అందించాలన్నారు. వీధి వ్యాపారులు వ్యాపార పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టు తిరిగి అప్పులు చేయొద్దని.. బ్యాంకర్లకు రుణాలను అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వీ గణేష్, బ్యాంకర్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ అభివృద్ధి, పట్టణ ఐకేపీ, పశు సంవర్ధక, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పెట్రోల్​ బంక్​ యజమానుల 'చీప్'​ దందా.. రాష్ట్రంలో 9 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.