జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ను శిక్షణ ఐపీఎస్ అధికారి సుధీర్ కేకేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రొబేషనరీ ఏఎస్పీ( అండర్ ట్రైనింగ్ )గా ఐపీఎస్ అధికారి సుధీర్ కేకేకన్ నియమించబడ్డారు.
పూర్తిగా క్షేత్రస్థాయిలో శిక్షణ పొందడానికి జిల్లా చాలా అనుకూలమైందని కలెక్టర్ సూచించారు. ప్రజలకు సేవ చేస్తూ... జిల్లాలో పోలీస్ అధికారిగా మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.